ములుగు: పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణకు సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavati Rathod ) నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ సంగ్రామ్ సింగ్, అఖిలపక్ష నేతలు, అధికారులు హాజరయ్యారు.