TS EAMCET Results | టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీళ్లే..
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు.
TS EAMCET Results | హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in/తోపాటు www.ntnews.comలో చూడవచ్చు. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి చెప్పారు.
ఎంసెట్ పరీక్షలను ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేసుకోగా 1,95,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు 1,15,361 మంది అప్లయ్ చేసుకోగా 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలకోసం https://www.ntnews.com/telangana-eamcet-2023-results క్లిక్ చేయండి
ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
సనపాల అనిరుధ్(విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్, మెడిసిన్ టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
తొలి ర్యాంకు – బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్(ఈస్ట్ గోదావరి)
రెండో ర్యాంకు – నశిక వెంకట తేజ(చీరాల)
మూడో ర్యాంకు – సఫల్ లక్ష్మీ పసుపులేటి(రంగారెడ్డి)
నాలుగో ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు)
ఐదో ర్యాంకు – బోర వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)
ఆరో ర్యాంకు – దేవగుడి గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంకు – వంగీపురం హర్షిల్ సాయి(నెల్లూరు)
ఎనిమిదో ర్యాంకు – దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
తొమ్మిదో ర్యాంకు – గంధమనేని గిరి వర్షిత(అనంతపురం)
పదో ర్యాంకు – కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

