ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం దేశానికి మంచిది కాదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెట్టేలా చేస్తుంది. సెక్యులర్ భావాన్ని బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు వదల్లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి వదిలిన రుగ్మతలే ఈ దేశానికి ఇబ్బందిగా మారాయన్నారు.ఎన్ డీఏ చట్టాలను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఉమ్మడి పౌరసత్వం పై నోరు ఎందుకు పెగలట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి బీటీమ్ కాంగ్రెస్ అని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ కలిస్తే నేను రాజీనామా చేస్తా.ఖమ్మంలో మతతత్వ పార్టీలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఆఫ్ టోపి పెట్టుకునే నాయకులు వస్తారు, ప్రజలకు టోపి పెట్టి వెళ్లిపోతారని పేర్కొన్నారు.
కేసీఆర్ లాంటి మొనగాడు మాత్రమే తెలంగాణకు శ్రీ రామరక్ష. ఈ దేశాన్ని నాడు గుల్ల చేసింది కాంగ్రెస్, నేడు బీజేపీ చేస్తున్నదని మండిపడ్డారు. ముస్లింలు, క్రిస్టియన్ పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకోవాలన్నారు. జోడో యాత్ర గుజరాత్లో ఎందుకు చేయాలో చెప్పాలన్నారు. కరంట్ వస్తే మూడు గంటలు కరెంట్ ఇస్తా అని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టు. రేవంత్ రెడ్డి అమెరికాలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.