హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన అనుమతులివ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి తన్మయికుమార్ను కోరారు. కేంద్రమంత్రి భూపేందర్యాదవ్ విదేశాల్లో ఉండగా, సెక్రటరీ కోఆర్డినేటర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి తన్మయికుమార్ను సోమవారం ఢిల్లీలో కలిశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతులపై చర్చించారు. అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 2025 మేలో ఇచ్చిన వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల వెనకి తీసుకుందని, న్యాయసలహా తీసుకుని అనుమతుల మంజూరు చేస్తామని తన్మయికుమార్ హామీనిచ్చినట్టు పొన్నం చెప్పారు.