వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకు కోడె మొక్కు సమర్పించుకున్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, నాయకులు ఉన్నారు.