హైదరాబాద్,నవంబర్25(నమస్తే తెలంగాణ): సూల్ బస్సులపై నిరంతరం నిఘా ఉంచి, తనిఖీలు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీవో అధికారులను ఆదేశించారు. 15 ఏండ్లు దాటిన సూల్ బస్సులను సీజ్ చేయాలని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రవాణాశాఖ అధికారులతో మంత్రి పొ న్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25వేల సూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలని కోరారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రతి పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో ట్రాఫిక్ అవగాహన పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణాశాఖకు ప్రత్యేక లోగో రాబోతుందని వెల్లడించారు. ప్రజా విజయోత్సవాల్లో దానిని ఆవిషరించనున్నట్టు పేర్కొన్నారు.