హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): నిబంధనలు పాటించని వాహనాలపై ట్రిపుల్ పెనాల్టీతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. స్లీపర్ బస్సులు, కార్గో సరుకులు తరలించే బస్సులు నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం అనంతరం సోమవారం రవాణా శాఖ అధికారులతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకూ ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. మరోవైపు టిప్పర్ అతివేగమే మీర్జాగూడ బస్సు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఆర్టీసీ ఎండీ వైనాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.