ప్రవళికకు ప్రభుత్వం అండ : పొన్నం
ప్రయాణికురాలి దాడితో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రవళికకు మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రయాణికురాలి దాడితో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రవళికకు మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రయాణికులు గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబర్ 9 నుంచి కుట్టుమిషన్లు
మహిళలకు డిసెంబర్ 9 నుంచి కుట్టుమిషన్లను పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బీసీ సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విదేశీ విద్యా నిధి పథకానికి సకాలంలో నిధులు అందేలా చూడాలని, 38 కులాల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

