హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖలో చేపడుతున్న సంస్కరణల అమలుకు సహకరించడంతోపాటు తగినన్ని ని ధులు కేటాయించాలని మంత్రి పొ న్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కో రారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గ డరీతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఐడీటీఆర్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్) ఏర్పాటుకు, మల్టీ-లేన్ ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏ ర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం వీఐలు, ఏఎంవీఐలకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు నిధులు మంజూరు చేయాలని, ఈవీ చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు సహకరించాలని కో రారు.