Congress Govt | మంత్రులు తలోదారి.. అయోమయంగా కాంగ్రెస్ పాలన!
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అయోమయంగా సాగుతున్నది. మంత్రుల గజిబిజి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
- హైదరాబాద్‌లో పొంగులేటి సమీక్ష
- వరంగల్‌లో దుద్దిళ్ల, జనగామలో కోమటిరెడ్డి కార్యక్రమాలు
- సమీక్షకు పశ్చిమ ఎమ్మెల్యే గైర్హాజరు
Congress Govt | వరంగల్, జూలై 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అయోమయంగా సాగుతున్నది. మంత్రుల గజిబిజి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యం లో గురువారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.
మంత్రులు సురేఖ, సీతక్క, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి, మేయర్ సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాశ్‌రెడ్డి, మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఈ సమీక్షకు గైర్హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి సమీక్ష సమయంలోనే వరంగల్‌లోని ఎల్బీ కాలేజీ 50వ వార్షికోత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. దీంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెలే రాజేందర్‌రెడ్డి సమీక్షకు హాజరు కాలేదు. గ్రేటర్ వరంగల్‌లోని ఎక్కువ ప్రాంతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంటుంది. తాను హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమీక్ష నిర్వహించడంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు.
మరోవైపు మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే జనగామలో దొడ్డి కొముర య్య విగ్రహావిష్కరణకు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎవరికి వారుగా ఒకే ఉమ్మడి జిల్లాలో పాల్గొనడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

