ఇది ‘ఈ నగరానికి ఏమైంది’కి ఎపిక్ వెర్షన్
‘నాజీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఓ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారు.
‘నాజీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఓ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత నేను ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చేయడానికి ప్రేరణ వాళ్లే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ENE Repeat’ చేశాను. ఈ సినిమాపై అంచనాలు బలంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఓ ఎపిక్ వెర్షన్‌లా ఉండేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశాం. సినిమా కూడా అలాగే ఉంటుంది. పాజిటీవ్ ఎనర్జీతో చేసిన సినిమా ఇది.
సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం. ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ENE Repeat’. విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటించిన ఈ చిత్రానికి సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్‌భాస్కర్ మాట్లాడారు.
ట్రైలర్ అద్భుతంగా అనిపించిందని, తరుణ్‌భాస్కర్ ప్రాణంపెట్టి సినిమా చేశారని, నవ్వించే, ఆనందంతో ఏడిపించే అంశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని హీరో విశ్వక్సేన్ చెప్పారు. ఇంకా అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, అనిషా, శివాత్మిక, నిర్మాత సృజన్ కూడా మాట్లాడారు. గందరగోళం, ఉత్సాహాలతో నిండిన ఒక వినోదాత్మక ప్రయాణాన్ని ఈ సినిమా అందించబోతున్నదని ట్రైలర్ చెబుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

