బీఆర్ఎస్ పైలాన్‌పై రణరంగం
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి పథకాల ఆనవాళ్లను చెరిపేసేందుకు మున్సిపల్ బుల్డోజర్ దూసుకొచ్చింది.
- రామగుండం అభివృద్ధిపై 2023లో కేటీఆర్ ప్రారంభం
- ఆనవాళ్లు కనిపించొద్దని గ్యాస్ కట్టర్లతో సర్కార్ తొలగింపు
- మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో ఆందోళన
గోదావరిఖని/గోదావరిఖని కోల్‌సిటీ, నవంబర్ 3: పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి పథకాల ఆనవాళ్లను చెరిపేసేందుకు మున్సిపల్ బుల్డోజర్ దూసుకొచ్చింది. గోదావరిఖని నడిబొడ్డున అభివృద్ధికి చిహ్నంగా ఉన్న పైలాన్‌ను గ్యాస్కట్టర్లతో తొలగించగా బీఆర్ఎస్ భగ్గుమన్నది. కేసీఆర్, కేటీఆర్ చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన పైలాన్ గోదావరిఖని నడిబొడ్డున ఉండడాన్ని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కనుసన్నల్లో, రాజకీయ కక్షతో ఇలా వ్యవహరించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. రామగుండంలో చేసిన అభివృద్ధికి చిహ్నంగా 2023, మే 8న గోదావరిఖని గాంధీనగర్చౌక్ వద్ద నగరపాలక సంస్థ స్టీల్ పైలాన్ నిర్మించగా, అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు బలగాలతో కలిసి గ్యాస్కట్టర్లతో పైలాన్‌ను తొలగింపజేసింది.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు మూల విజయారెడ్డి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, కౌశికహరి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్ తోకల శ్యామణీరమేశ్, ఆకారపు రేఖామహేశ్, మాజీ కార్పొరేటర్ కృష్ణవేణితోపాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పైలాన్‌ను క్రేన్ సాయంతో తరలిస్తుండగా రోడ్డుపై అడ్డుకుని బైఠాయించారు. ఆరు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కోరుకంటి చందర్, విజయారెడ్డి, హరీశ్‌రెడ్డి, కౌశిక హరి, సమ్మయ్య, మారుతిని పోలీసులు బలవంతంగా వేర్వేరు వాహనాల్లో ఎక్కించి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

