హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడారు. 33 జిల్లాల్లో వర్షంప్రభావితం చూపిందని, 358 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 2 లక్షల మంది ప్రభావితం అయ్యారని తెలిపారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి వివరించారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో వరద సహాయ నిధి సేకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలతో నష్టపోయిన బాధితుల సహాయార్థం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం బస్‌భవన్ వద్ద రూ.5,070 నిధిని వసూలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, సీఐటీయూ నాయకుడు సోమన్న, ఎస్‌డబ్ల్యూఎఫ్ జీహెచ్‌జెడ్ అధ్యక్షుడు, కార్యదర్శి ప్రకాశ్, జీఆర్‌రెడ్డి పాల్గొన్నారు.