హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ): పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డిప్యుటేషన్‌పై వివిధ శాఖల్లో పనిచేస్తున్న 326 మంది హౌసింగ్ శాఖ ఉద్యోగులను తిరిగి నియమించి హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామని తెలిపారు.