హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తున్నది తప్ప.. ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జొహాన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారైశాఖ మునుగోడు విజయోత్సవ సంబురాలు నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్బండ వర్ణాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తప్పక రాణిస్తారని చెప్పారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించినందుకు మునుగోడు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇన్చార్జిగా ఉన్న దేవర భీమనపల్లిలో టీఆర్ఎస్కు 613 ఓట్ల భారీ అధిక్యత వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కమిటీ సభ్యులు హరీశ్ రంగా, సాయికిరణ్ నల్ల, కిరణ్‌కుమార్ బెల్లి, శ్రీధర్‌రెడ్డి, సౌజన్రావు, అరవింద్ చికోటి, శ్రీనివాస్ రేపాల, వూరే వంశీ, రాంబాబు తోడుపునురి పాల్గొన్నారు.