సహకారశాఖ ప్రాధాన్యం పెరిగింది : నిరంజన్‌రెడ్డి
Minister Niranjan Reddy | సహకారశాఖ ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గృహకల్పలో బుధవారం తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్ : సహకారశాఖ ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గృహకల్పలో బుధవారం తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార శాఖ ఉద్యోగులకు నిరంతర శిక్షణలు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలన్నారు. సాగునీటి రాకతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో సహకార శాఖ ప్రాధాన్యం పెరిగిందన్న ఆయన.. నీటి వృథాను అరికట్టడం, సాగు చేయాల్సిన పంటల రకాల మీద రైతులను చైతన్యం చేసే బాధ్యత సహకార శాఖ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరంగంలో మనుషుల మధ్య సంబంధాలను పెంచేందుకు కృషిచేయాలని, సహకార సంఘాలు బలోపేతం కాకుంటే కార్పోరేట్ వ్యవస్థ వేళ్లూనుకుంటుందని హెచ్చరించారు. దాంతో సమాజానికి నష్టం చేకూరుతుందన్నారు.
గతంలో సహకార సంఘాల్లో ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులుండేవని, తెలంగాణ ఏర్పాటు తర్వాత సహకార సంఘాలు బలోపేతమయ్యాయన్నారు. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకార ఉద్యోగులు కేరళలోని సహకార సంఘాలను అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

