బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:22

మూస సాగుకు స్వస్తి

మూస సాగుకు స్వస్తి

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మూససాగుకు స్వస్తి పలికి.. నియంత్రిత పద్ధ్దతిలో వ్యవసాయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులకు ఆదాయం పెరిగేలా.. అవస్థలు పోయేలా సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కంది, ఆముదం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆయిల్‌పాం వంటి పప్పు, నూనె పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రత్యామ్నాయంగా ఏ పంటలను రైతులకు సూచించగలమో చెప్పాలని అధికారులను కోరారు. పంటల సాగుపై రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కావా లి? ప్రభుత్వం ఏం సమకూర్చాలి? అనే అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  


logo