గోపాల్పేట(వనపర్తి) : దేశ భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీపైనే ఆధారపడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ వ్యవసాయ, సంక్షేమ పథకాలు అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్ మొదలైందని పేర్కొన్నారు.
ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు(Telangana Schemes) విధిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సాగునీటి(Irrigation Water) రాకతో ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి ఉపాధి దొరికిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల స్వరూపం పూర్తిగా మారడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. మహారాష్ట్ర నుంచి మార్పు మొదలైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.