మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం
వనపర్తి, ఆగస్టు 11: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరలో నీళ్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ వద్ద శనివారం నిర్వహించనున్న రైతు సంబురాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్ర యత్నాలతో పాలమూరు పథకం పనులకు పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. రెండేండ్ల కిందటే ప్రాజెక్టు పూర్తై ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నా.. ఇక్కడి ఇంటి దొంగలే కోర్టుల్లో కేసులు వేసి పనులకు అడ్డు తగిలారని ఆరోపించారు. ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. కేంద్రం సహకరించకపోవడం తో పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నా రు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలో నీళ్లివ్వడానికి సిద్ధమయ్యామని తెలిపారు.