సిద్దిపేట : చుక్క నీళ్లు దొరకని దుబ్బాక ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు దొరకని పరిస్థితి.. ఇప్పుడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
దుబ్బాకలో గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఇక్కడి ప్రజలు చూడాలి అని కోరారు. నిన్న ఓ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ, తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని అన్నాడు. మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని సూచించారు. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ కట్టారా? అని నిలదీశారు. మీరు ప్రాజెక్టులు కట్టరు, మేము కడితే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికష్టాలు వచ్చిన రైతు బంధు ఆపలేదు అని స్పష్టం చేశారు. 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్కు మనందరం అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మంత్రులు @trsharish గారు, @puvvada_ajay గారితో కలిసి నూతన బస్టాండ్ ప్రారంభించిన అనంతరం మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyTRS గారు, హాజరైన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ గారు pic.twitter.com/LeFsmqBYpb
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) December 30, 2022