మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 19: గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన శివాజీ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శివాజీ హిందూ దేవాలయాలతోపాటు అనేక మసీదులు కట్టించారని తెలిపారు. సైన్యంలో మూడో వంతు ముస్లింలే ఉండేవారన్నారు. నేటి యువత శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.