వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనేక దశాబ్దాలుగా సాగుచేసుకొని వాళ్ల జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు.
అటవీ భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకొని బతుకుతున్న గిరిజన రైతులకు శాశ్వత ఉపాధిని కల్పించేందుకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు అందజేశారన్నారు. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 2,845 గ్రామాల్లో యాభై వేల రైతు కుటుంబాలకు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు పట్టాలు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటి సంరక్షించడంతో నేడు తెలంగాణలో అటవీ శాతం పెరిగిందని గుర్తు చేశారు. గిరిజనులు కూడా అడవులను సంరక్షించాలన్నారు. పట్టా పొందిన ప్రతి ఒక్కరు ఎకరం స్టలం లో పది నుంచి 15 మొక్కలను పెంచాలని మంత్రి సూచించారు.
of potdu Land pattas