వనపర్తి : తెలంగాణలో 50 లక్షల మందికి ఫించన్లు అందిస్తున్నామని వ్యవసాయ శాఖ
మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా విపత్తు మూలంగా కొత్త ఫించన్ల పంపిణీ కొంత ఆలస్యం అయిందన్నారు. గురువారం జిల్లాలోని ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో నూతన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు.
బడుగు, బలహీనవర్గాలకు మేలు జరగాలన్న తలంపుతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.