Minister Mallareddy | పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం : మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy | పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందుకు దూసుకెళ్తుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
మేడ్చల్ : పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందుకు దూసుకెళ్తుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలోని విష్ణుల్యాబ్స్ లిమిటెడ్, జినోమ్ వాలీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పారిశ్రామిక ఉత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వినూత్న కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాల(Industrial Policy)తో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) కృషి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) పట్టుదల వల్లే సాధ్యమైందని ప్రశంసించారు. గతంలో మాదిరిగా ఎలాంటి పవర్ హాలీడేలు ఇవ్వకుండా ప్రతినిత్యం ఇరవైనాలుగు గంటల పాటు ప్రభుత్వం విద్యుత్‌ను అందిస్తుందని అన్నారు. పరిశ్రమల ఉత్పత్తులు పెంచుకుంటుండంతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్‌కు మరో రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు
మంత్రి కేటీఆర్ ఇటివలే విదేశాలలో పర్యటించి రాష్ట్రంలో రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు తెప్పించారని మంత్రి వెల్లడించారు. దీని వల్ల మరో 42 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానాలతో అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే మంచి కంపెనీల వస్తున్నాయని అన్నారు. కరోనా తగ్గించేందుకు వ్యాక్సిన్ మొట్టమొదటి సారి ఇక్కడే కనిపెట్టడం గర్వకారణమన్నారు. కరోనా(Corona) వాక్సిన్ను ప్రపంచ దేశాలకు 35 శాతం అందించిన ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా రూ.11 వేల కోట్ల పెట్టుబడులతో 4809 పరిశ్రమల ఏర్పాటు జరిగిందని తెలిపారు. లక్షా 8 వేల మందికి ఉపాధి దొరికిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, భారత్‌బయోటెక్ ఈడీ కృష్ణమోహన్, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, విమ్కా ల్యాబ్స్ లిమిటెడ్ చౌర్మన్ వాసిరెడ్డి, బయేలాజికల్ల్యాబ్స్ డైరెక్టర్ అనిల్ చిట్టి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

