హైదరాబాద్ : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు వికలాంగులకు అండగా నిలవబోతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. గతేడాది తన బర్త్‌డే సందర్భంగా కేటీఆర్.. తన సొంత ఖర్చులతో 6 అంబులెన్స్‌లను అందించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 100 అంబులెన్స్‌లను అందజేశారు.
తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సొంతంగా ఎవరికైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ కోరారు.
మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తమకు ప్రేరణగా నిలిచే నాయకుడి అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉందన్నారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా తాను కూడా 50 బైక్‌లను విరాళంగా ఇస్తానని బాల్క సుమన్ ప్రకటించారు.
A request to TRS party leaders & other well wishers those who would like to greet me, kindly plant a sapling if you can as part of #MukkotiVruksharchana or #GiftASmile in your own personal way by helping someone in need
— KTR (@KTRTRS) July 22, 2021
Please don’t splurge money on bouquets, cakes & hoardings