శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Feb 23, 2021 , 18:19:45

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌ భేటీ

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌ భేటీ

హైదరాబాద్‌ : బయో ఆసియా సదస్సులో భాగంగా రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో చర్చావేదికలో పాల్గొన్నారు. వర్చువల్‌ వేదికగా సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల బయో ఆసియా నిర్వహణను ప్రశంసించారు. వైద్యరంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఇన్‌పేషెంట్‌ సేవల విభాగంలోనూ ఏఐది కీలకపాత్ర అన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి ఉపయోగపడాలనేది సీఎం కేసీఆర్‌ అభిమతమన్నారు. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్యరంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అన్నారు.

VIDEOS

logo