Minister KTR | హైదరాబాద్‌లో ఫెడెక్స్, బోయింగ్ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ హర్షం
Minister KTR | హైదరాబాద్ : అమెరికా( America )కు చెందిన ఫెడెక్స్( FedEx ), బోయింగ్( Boeing ) సంస్థలు తమ కంపెనీలను హైదరాబాద్( Hyderabad )లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హర్షం వ్యక్తం చేశారు.
Minister KTR | హైదరాబాద్ : అమెరికా( America )కు చెందిన ఫెడెక్స్( FedEx ), బోయింగ్( Boeing ) సంస్థలు తమ కంపెనీలను హైదరాబాద్( Hyderabad )లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. #HappeningHyderabad అనే హ్యాష్ ట్యాగ్‌ను కేటీఆర్ జత చేశారు.
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్‌తో భారత్‌లో తన విస్తరణ కార్యకలాపాలను మరింత వేగవంతం విస్తరించడానికి దోహదం చేయనున్నదని పేర్కొంది. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు మరింత వేగవంతంగా సరుకు రవాణ చేయడానికి అవసరమైన టెక్నాలజీ, ఇన్నోవేషన పరంగా చర్యలకు ఈ సెంటర్ కీలకంకానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఏసీసీ సెంటర్లను నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది.
విమానయాన రంగంలో హైదరాబాద్ శరవేగంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే విమాన విడిభాగాలు, హెలికాప్టర్ బాడీ తయారీ వంటి వాటికి ప్రసిద్ధిగాంచిన మన నగరంలో.. త్వరలోనే సరికొత్త కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. జీఎమ్మార్ ఏరో టెక్నిక్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ప్రయాణికుల విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చే కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ఇందులో భాగంగా 737 బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేయనున్నారు. దీనికోసం కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు రేపోమాపో ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Two Big American enterprises @FedEx and @Boeing choose Hyderabad for their investments 😊#HappeningHyderabad pic.twitter.com/o6HRCKej3G
— KTR (@KTRBRS) March 10, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Boeing
- FedEx
- Hyderabad
- Minister KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

