హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి యాంటి ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. మొత్తం 8 మంది సభ్యులు ఉండే కమిటీల్లో కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ కార్యదర్శి (మెంబర్ సెక్రటరీ)గా, ఎస్పీ, యూనివర్సిటీ/కాలేజీ/విద్యాసంస్థ అధిపతి, స్థానిక మీడియా ప్రతినిధి, ఎన్జీవో, విద్యార్థి సంఘాలు, స్థానిక పోలీసులు, పరిపాలన విభాగం నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ వేసవి సెలవుల్లో ప్రతిసంస్థలో సన్నాహక సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. జాతీయంగా ర్యాగింగ్ నిరోధక హెల్ప్‌లైన్ 1800 -180-5522 కాల్ చేయాలని, helpline @ anti ragging.in ఈ మెయిల్‌ను సంప్రదించవచ్చని యూజీసీ సూచించింది.