హైదరాబాద్: బాష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దానికి తగిన వేగంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించినట్లు మంత్రి తెలిపారు.
హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు. ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయినట్లు తెలిపారు. బాష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్, కార్లలోనూ సాఫ్ట్వేర్ పెరుగుతోందన్నారు. ఆటోమోటివ్ రంగంలో బాష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మొబిలిటీ వ్యాలీని సృష్టించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. క్వాల్కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు హైదరాబాద్‌లో దూసుకువెళ్తున్నాయన్నారు.
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియాలో ఆ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈవీవీ సమ్మిట్‌ను నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
After announcing the new Bosch centre at Hyderabad in February this year, today inaugurated the facility
Was earlier expected to employ 3,000 but it appears that it will only grow higher
Congratulations to Team @BoschGlobal 👏 https://t.co/1T8MjPrevE pic.twitter.com/5MFw54kKX0
— KTR (@KTRTRS) December 14, 2022
Bosch’s new campus is testimony to the engineering talent and innovation ecosystem present in Telangana. Our Govt.’s focus on providing world-class infra to tech companies helped attract various corporations while propelling Hyderabad as the ideal tech city in the country: KTR
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 14, 2022