Minister KTR | ఎర్రబెల్లి ట్రస్టు సేవలు ప్రశంసనీయం : మంత్రి కేటీఆర్
Minister KTR | పేదలకు ఎర్రబెల్లి ట్రస్టు అందిస్తున్న వినూత్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి కెటి రామారావు అన్నారు.
హైదరాబాద్ : కడుపులు కొట్టడమే తప్ప, మరే మంచితనం కనుచూపు మేరలో కనిపించని ఈ రోజుల్లో నిరుపేదలు, కూలీల కడుపులు నింపే కార్యక్రమం చేపడుతున్న ఎర్రబెల్లి ట్రస్టు సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Minister KTR) కొనియాడారు. ట్రస్టును విజయవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) , ఉషా దయాకర్ రావు దంపతులను అభినందించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 70వేలకుపైగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, సెల్ ఫోన్ వంటి వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేసిన బ్యాగ్ (Bag) ను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తు వినూత్న సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ , ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, కరోనా కష్ట కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేసారని అన్నారు. తాజాగా చేపట్టిన ఉపాధి కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ మానవత్వం తో కూడినదిగా కొనియాడారు. కూలీలను చులకనగా చూడకుండా, వారికి కూడా ఏదో చేయాలన్న సంకల్పంతో బ్యాగ్‌ల పంపిణీ ఆదర్శంగా, అనుసరణీయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

