హైదరాబాద్ : ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మేడిన్ హైదరాబాద్‌గా ఫైటర్ వింగ్స్ తయారు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగాయనడానికి.. ఎఫ్-16 వింగ్ సర్టిఫికేషన్, డెలివరీ గొప్ప సాక్ష్యంగా నిలిచాయన్నారు. టాటా, లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యం శుభ పరిణామం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పెస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి టాటా, లాక్‌హీడ్ మార్టిన్ చేసిన నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రెండు రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఇండియాలోనే తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం గత ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఐదేండ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఏరోస్పెస్ సెక్టార్లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
IT and Industries Minister @KTRTRS lit the ceremonial lamp and participated in the TATA @LockheedMartin Aerostructures Ltd ‘Fighter Wing Qualification Ceremony’ in Adibatla. pic.twitter.com/1D9qWe5iVD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 7, 2021