టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు పెరగడంతో.. KTR అనే అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్త శనిగారపు అర్జున్‌కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. దీంతో గతేడాది కూడా తన పొలంలో KTR అనే అక్షరాల ఆకారంలో నారు పోసి, పెంచి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అర్జున్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అన్న @KTRTRS పైన ఉన్న ప్రేమాతో వరుసగా రెండవసారి అభిమానం చాటుకున్న అర్జున్…
— Gatla Satheesh (@gatla4747) July 15, 2021
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన తెరాస యువ కార్యకర్త శనిగారపు అర్జున్ కేటీఆర్ మీద ప్రేమతో గతేడాది,ఈ ఏడాది తన పొలంలో ktr ఆకారంలో నారు పోసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.@JAGANTRS pic.twitter.com/eAG5LaxjCM