బంజారాహిల్స్, నవంబర్ 16 : ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మద్దతుగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 7గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 5లోని జహీరానగర్ చౌరస్తాలో బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్లకు చెందిన ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ రోడ్ షోలో ప్రసంగించనున్నారు.
అనంతరం హిమాయత్‌నగర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. హిమాయత్‌నగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు చెందిన ప్రజలనుద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.