హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాష్ట్రంలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ వేదికగా మరోసారి నిలదీశారు. ‘జాతీయ హోదా మాకొద్దా? అంటూ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.