ఆ 19 మున్సిపాలిటీలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు : మంత్రి కేటీఆర్
Minister KTR | అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు రూ
హైదరాబాద్ : అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బడంగ్పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్, అలంపూర్, పీర్జాదిగూడ, కోరుట్లకు నిధులు మంజూరు చేయనున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు. దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి రెండవ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డులు సాధించేందుకు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాక అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే సాధ్యమైనది. జాతీయస్థాయిలో ఇంత గొప్ప గుర్తింపు లభించిందని ప్రశంసించారు.
వారే అవార్డులు ఇస్తారు.. వారే విమర్శిస్తారు..
20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం చెబుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణలో నిలిచింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెబుతుంది. కానీ ఇక్కడ పరిపాలన సరిగా లేదని అబద్దాలను చెబుతుంది కూడా కేంద్రంలోని నాయకులే. అయితే ఇలాంటి అర్థరహిత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకవైపు అవార్డులు, రివార్డులతో పాటు ప్రజల ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు.
జపాన్, సింగపూర్‌కు స్టడీ టూర్‌కు పంపిస్తాం..
తెలంగాణలో స్థానిక సంస్థల విధులను నిర్ణయించడం, నిధులు మంజూరు చేయడం వల్లనే ఇంత ప్రగతి సాధ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో, మునిసిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు తెలంగాణలోని పట్టణాలు, గ్రామాలు గొప్పగా మారాయి. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ వల్ల ఎంతో మంది అద్భుతమైన మహిళా నాయకులు పురపాలికలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తు చేశారు. అవార్డులు సాధించిన ఈ 19 పూరపాలికలకు చెందిన చైర్పర్సన్లను, కమిషనర్లను, అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్‌కు పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతులపైన అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తాం. ఇందులోంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ కు అధ్యయనానికి పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. పట్టణాలను ప్రజలు మాది అని భావించినప్పుడే అవి అద్భుతంగా అభివృద్ధి సాధిస్తాయి. ఆ దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

