ములుగు : గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా? కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపును కాంక్షిస్తూ ఏటూరు నాగారం(Eturu Nagaram)లో సోమవారం రోడ్ షో(Road show)లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇంచ్చిన ఘనత కేసిఆర్ది అన్నారు. ములుగులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేక పోయినా జిల్లాను చేశామన్నారు. కరెంట్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని మండిపడ్డారు. కరెంట్ కష్టాలకు కారణం ఆ పార్టీనేనని ఆరోపించారు.
కేటీఆర్ రోడ్ షోకు భారీగా హాజరైన జనం
రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ఖు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగిందని మండిపడ్డారు. రైతుల నోటికాడి బుక్క దూరం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకుందామా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఎన్ని కథలైనా చెపుతారు నమ్మొదన్నారు. ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇన్స్టాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యను గెలిపించాలన్నారు.