విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం
Minister KTR | తిమ్మాజిపేట మండల కేంద్రంలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
నాగర్‌కర్నూల్ : తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
తిమ్మాజిపేటలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అధునాతన సదుపాయాలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరం పుడుతాం.. మనకాలపరిమితి ముగిశాక నిష్క్రమిస్తాం. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తేనే చిరస్థాయిగా గుర్తుండిపోతాం. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. రాష్ట్రంలోనే ఒక వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రామికవేత్తగా ఎదిగారు. అంతేకాకుండా తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని మరిచిపోకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ఈ స్కూల్ బాగుంది. ప్రధానోపాధ్యాయుడి చాంబర్, టీచర్ల స్టాఫ్‌రూమ్, పిల్లలకు ల్యాబ్స్, భోజనశాల, గ్రౌండ్ అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి వాతావరణం ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేదు. పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి ఒక విద్యాలయానికి నిధులు సమకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రూ. 7289 కోట్లతో 26 వేల పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమంతో తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి @KTRTRS pic.twitter.com/kC1A6GNw4e
— KTR, Former Minister (@MinisterKTR) February 4, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

