సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు కిస్టు నాయక్ తండాలో కొద్దిసేపు ఆగిన మంత్రి కేటీఆర్.. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవునిగుట్ట తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరుపల్లి తండా గ్రామపంచాయతీ భవనం, తర్వాత రాచర్ల తిమ్మాపూర్లో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.