చండ్రుగొండ, ఫిబ్రవరి 22: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఓ బాలికకు కృత్రిమ కాలు సమకూరుస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాతగుండాలపాడుకు చెందిన కారం వెంకటేశ్వర్లు కు మార్తె మానస ఏడోతరగతి చదువుతున్న రోజుల్లో ఆమె ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వైద్యం చేయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవే టు దవాఖానకు తరలించగా ఇన్ఫెక్షన్ పైకి సోకడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి మోకాలి వరకు తీసేశారు. ‘పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్స్’ అనే స్వచ్ఛంద ప్రతినిధి సంతోష్ సదరు బాలిక విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశాడు. మంత్రి వెంటనే స్పందించి బాలికకు కృత్రిమ కాలు సమకూర్చేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం కేటీఆర్ కార్యాలయం నుంచి బాధిత కుటుంబానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.