బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 18:20:08

ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో కేటీఆర్‌.. వీడియో

ఫ్లైట్‌ సిమ్యులేటర్‌లో కేటీఆర్‌.. వీడియో

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొత్త అనుభూతిని పొందారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని శంషాబాద్ లో మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం పైలట్ లకు ప్రాథమిక శిక్షణ ఇచ్చే ఫ్లైట్ సిమ్యులేటర్ లో కేటీఆర్ కాసేపు గడిపారు. 

దేశంలో ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌(ఎఫ్‌ఎస్‌టీసీ). డీజీసీఏ, ఈఏఎస్‌ఏ చేత గుర్తింపు పొందిన సంస్థ ఎఫ్‌ఎస్‌టీసీ. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎఫ్‌ఎస్‌టీసీ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయన్నారు. ఎఫ్‌ఎస్‌టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.


logo