హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్..!
Minister KTR | హైదరాబాద్ నగరంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Minister KTR | హైదరాబాద్ నగరంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని కోరగా కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చిన మాట మేరకు ఎట్టకేలకు నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు బస్సులను ప్రారంభించగా.. త్వరలోనే 20కి పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎలక్రిక్ బస్సు ధర రూ.2.16కోట్లు. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంది. బస్సు ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ నెల 11న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ప్యారడైజ్, నిజాంకాలేజీ ప్రాంతాల్లో తిరుగనున్నాయి.
హైదరాబాద్ నగరంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో @DrRanjithReddy, @imAkbarOwaisi పాల్గొన్నారు. మరో మూడు బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. pic.twitter.com/4WkUnwjzGG
— Namasthe Telangana (@ntdailyonline) February 7, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

