హైదరాబాద్ : ఏఐసీసీ నాయకుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయనకు చురకలంటించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను పరుష పదజాలంతో విమర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బయటపడిన నేపథ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాషణను జర్నలిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జర్నలిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్రశ్నిస్తూ.. సుపారీ జర్నలిస్టు అని పేర్కొనొచ్చు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. పీసీసీ చీఫ్ పోస్టును విక్రయించిన సుపారీ ఏఐసీసీ ఇంచార్జిల సంగతేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది తాను చెప్పడం లేదు.. మీ స్నేహితుడు, కాంగ్రెస్ ఎంపీనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. జర్నలిస్టులను ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం సరికాదన్నారు కేటీఆర్.
What about Supari AICC incharges who sell the post of PCC chief?
— KTR (@KTRTRS) September 18, 2021
Am not saying this; your own colleague INC MP has said it on record 👇
Have some shame when you comment on journalists & their professional etiquette https://t.co/fJFQNDcz6b pic.twitter.com/qakei9Lab8