Minister Ktr | తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నది మమకారం.. అహంకారం కాదు: మంత్రి కేటీఆర్
Minister Ktr | తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని అన్నారు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR). ప్రజల నాడి తెలిసిన నేత కేసీఆర్ (Cm KCR) అని చెప్పారు.
Minister Ktr | తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని అన్నారు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR). ప్రజల నాడి తెలిసిన నేత కేసీఆర్ (Cm KCR) అని చెప్పారు. టీవీ9 మెగా కాన్ క్లేవ్ (Tv9 Mega Political Conclave 2023)లో పాల్గొన్న మంత్రి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని అన్నారు.
‘తెలంగాణ సమాజం రాష్ట్రంలో మార్పు కోరుకోవట్లేదు. కేసీఆర్ పట్ల ప్రజలకు ప్రేమ ఉంది. తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆయన పట్ల ప్రజల్లో ఆరాధనా భావం ఉంది. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి.. మూడోసారి హ్యాట్రిక్ సీఎం అవుతారు. నిజం చెప్పాలంటే 2014లోనే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా మార్పు కావాలని కోరుకుంటున్నది రాజకీయ నిరుద్యోగులే. ప్రజలు కాదు. వారు మంచి పనులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.
‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చేంత మమకారం ఉన్న వ్యక్తి కేసీఆర్. మమ్మల్ని చావచితకొట్టిందే కాంగ్రెస్. 55 ఏండ్లపాటు అహంకారంతో ఢిల్లీ పెత్తనం రుద్ది.. 55 ఏండ్లు వందల మందిని చంపి.. ఉద్యమ కారులను పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ వచ్చి ఇవాళ దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అంటే ఏమన్నట్లు. నవంబర్ 30 నాడు జరిగే ఎన్నిక వెయ్యి శాతం ఢిల్లీ దొరలకు.. ప్రజలకు మధ్య జరిగే ఎన్నిక. ఢిల్లీ దొరలు అని నేను ఆశామాషీగా అనట్లేదు. 1952లో ఇడ్లీ సాంబార్ ఉద్యమం అని మొదలుపెడితే.. ఐదుగురు పిల్లలను చంపిందే కాంగ్రెస్.. 1956లో ఆంధ్రతో తెలంగాణకు ఇష్టం లేని పెండ్లి చేసిందే కాంగ్రెస్.. 1968లో 378 మందిని పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్.. 1971లో 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే.. కర్కషంగా వాళ్లను, ప్రజాకాంక్షను తుంగలో తొక్కి.. కాంగ్రెస్లో కలుపుకున్నది ఇదే ఢిల్లీ దొరలు. 2004 నుంచి 2014 వరకు చావగొట్టింది కాంగ్రెస్. అహంకారం అంటూ ఉన్నది ఈ దేశంలో ఎవరికైనా అంటే అది కాంగ్రెస్కు ఢిల్లీ దొరలకే. మార్పు కావాలి కాబట్టే 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. 14 ఏళ్లు పోరాడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ రాకతోనే మార్పు వచ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read..
KTR | రేవంత్రెడ్డి మోదీ ఏజెంట్.. అందుకు ఇదే నిదర్శనం: కేటీఆర్
KCR | ఇలాంటి వాళ్లను రాజకీయాల నుంచి తరిమేయాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Tummala | నన్ను చంపేందుకు తుమ్మల కుట్ర.. విశ్రాంత పోలీస్ అధికారి సంచలన ఆరోపణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

