హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్‌ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అభినందించారు. సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను కలుసుకొన్న శ్రీనివాస్.. ప్రభుత్వ పథకాలపై తాను చేస్తున్న ప్రచార కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ మెచ్చుకొన్నారు. దేశంలో వినూత్న సంక్షేమ పథకాలను ప్రారంభించి, అమలు చేస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీయే హ్యాట్రిక్ విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.