హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ధ్రువ స్పేస్ బృందం ఆధ్వర్యంలో సీఎస్ఎల్వీ-సీ54 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ధ్రువ స్పేస్ బృందం చైతన్య దొర, క్రాంతి మూసునూరు, అభయ్ ఏగూర్, కృష్ణ తేజ, సంజయ్ నెక్కంటికి హృదయపూర్వక అభినందనలు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణమని, మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.