వరంగల్ : ఐలోని జాతర( Iloni jathara)లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అధికారుల పనితీరులో మార్పు రావాలని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. ఆదివారం ఐలోని మల్లికార్జున స్వామిని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్,వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతర ప్రాంగణంలో చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, జాతరకు వచ్చే భక్తులు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జాతరలో వృద్ధులకు, మహిళలకు, గర్భిణిలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. అత్యవసర సేవలు అందిందేందుకు మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. కరెంట్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. గతంలో జాతర కంటే..మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.