హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో ఇటీవల చీఫ్ ఇంజినీర్లుగా పదోన్నతులు పొందిన ఐదుగురు అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ తిరుమల (పరిపాలన), టీ జయభారతి (లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిసమ్ ప్రాంత రోడ్లు), టీ రాజేశ్వర్రెడ్డి ( రైల్వేసేఫ్టీ పనులు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, సీఆర్ఐఎఫ్), జీ చిన్న పుల్లదాసు (మెంబర్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ టెండర్స్), డీ శ్యామ్కుమార్కు (గ్రామీణ రోడ్లు, ఎస్సీఎస్డీఎఫ్) బాధ్యతలను అప్పగించారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఐదుగురు సీఈలతో శనివారం సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపించాలని ఈ సందర్భంగా సూచించారు.