హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులు త్వరితగతిన చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) కార్యదర్శి అనురాగ్ జైన్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో అనురాగ్ జైన్‌తో సమావేశమైన మంత్రి.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. స్పందించిన అనురాగ్ జైన్.. వారంలో ఎస్ఎఫ్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన ఉన్నారు.