హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రోడ్ల కోసం నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఎకడా వెనుకాడొద్దని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బిల్లు ల విషయంలో కాంట్రాక్టర్లకు ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యా పిటల్ వర్స్ మంత్రుల సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు రోడ్ల కనెక్టివిటీ ఉంటేనే గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు వెళ్తాయని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపా రు. ఉద్యోగం, ఉపాధి హైదరాబాద్లోనే కాదు.. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఎకడైనా దొరుకుతుందనే భావన సృష్టించాలని అభిప్రాయపడ్డారు. ఉద్యోగంతోపాటు పార్ట్ టైంలో వ్యవసాయం చూసుకునే వెసలుబాటు కల్పించే విధంగా మన ప్రణాళికలు ఉండాలని సూచించారు. అందుకు ప్రజలకు మొదటి ప్రాధాన్యతగా మంచి రోడ్లు ఉండాలని స్పష్టంచేశారు.