
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతమని, వారిని ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలకు భారత ప్రభుత్వ జాతీయ అవార్డు అందుకొన్న కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్, మెరిట్ సర్టిఫికెట్ల విజేతలు సాయిని భరత్, దుద్యాల శంకర్, తడక రమేశ్ తదితరులు సోమవారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి ఘనం గా సత్కరించారు. వృత్తి నైపుణ్యంతో అవార్డులు సాధించి, రాష్ర్టానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న పాల్గొన్నారు.